అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
భూదాన్ భూములపై డీజీపీకి ఈడీ నివేదిక.. మరిన్ని కేసులు?
Published on Thu, 11/28/2024 - 12:04
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విషయంలో ఈడీ అధికారులు.. డీజీపీకి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా భూదాన్ వ్యవహారంపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని నివేదికలో ఈడీ సిఫారసు చేసింది.
రాష్ట్రంలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి డీజీపీకి ఈడీ నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్తో పాటు ఎంఆర్వో జ్యోతి, ఆర్డీవో వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ రిపోర్టులో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా భూ బదాయింపుల్లో చోటుచేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో పలు అక్రమాలు జరిగినా గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులో నమోదు చేసి విచారించాలని సిఫార్సు చేసింది.
Tags : 1