Breaking News

డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌.. కొత్త డీజీపీగా రవిగుప్తా

Published on Sun, 12/03/2023 - 17:49

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సస్పెండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే డీజీపీ అంజనీకుమార్‌ సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  ఇంకా తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్‌రెడ్డితో భేటీ కావడమే డీజీపీపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని పూల బొకేతో కలవడంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే రావడంతో డీజీపీ అంజనీకుమార్‌పై వేటుకు కారణమైంది. డీజీపీతో పాటు  అదనపు డీజీలు మహేష్‌ భగవత్‌,  సంజయ్‌ జైన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ఈసీ. 

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా డీజీపీ ఇలా కలవడమే హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎన్నికల కోడ్‌ ఐదో తేదీ వరకూ ఉన్న నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థుల జాబితా ఇంకా పెండింగ్‌లోనే ఉండగానే ఇలా రేవంత్‌రెడ్డితో అధికార హోదాలో డీజీపీ అంజనీకుమార్‌ కలవడం వేటుకు ప్రధాన కారణమైంది. డీజీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో తదుపరి డీజీపీగా రవిగుప్తాను నియమించారు.

1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రవిగుప్తా.. డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు

డీజీపీ అంజనీకుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన కొద్ది గంటలకే రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)