Breaking News

‘తెలంగాణ కమిటీ’ లొంగిపోయినట్టే!

Published on Fri, 11/07/2025 - 03:38

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ముందు అనధికారికంగా సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ లొంగిపోయినట్టేనని ఆ పార్టీ ఈస్టర్న్‌ రీజినల్‌ బ్యూరో ఘాటైన విమర్శలు చేసింది. 

ఈ నెల 5న విడుదలైన లేఖలో తెలంగాణ కమిటీతోపాటు సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరోకు చెందిన నేతల తీరును ఈస్టర్న్‌ కమిటీ తప్పుపట్టింది. తొలి విడత కాల్పుల విరమణ వల్ల సానుకూల ఫలితాలు రాకున్నా, పార్టీలో అంతర్గత చర్చ జరపకుండా, ఇతర బ్యూరోల అభిప్రాయం కోరకుండా ఏకపక్షంగా మరో ఆరునెలలు తెలంగాణ కమిటీ తరఫున జగన్‌ పేరుతో కాల్పుల విరమణ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించింది.  

తీవ్ర నష్టం చేశారు..: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆపరేషన్‌ కగార్‌తో కలిగిన ప్రాణభీతి వల్లే సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో(ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా)కు చెందిన అగ్రనేతలు లొంగిపోయారంటూ ఈఆర్‌బీ ఆరోపించింది. ఆయుధాలు అప్పగించి కొందరు, ఆయుధాలు అప్పగించకుండా మరికొందరు లొంగిపోవడంతో పార్టీకి భారీ నష్టం జరిగిందని పేర్కొంది.

కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే సోను (మల్లోజుల వేణుగోపాల్‌), సతీశ్‌ (తక్కళ్లపల్లి వాసుదేవరావు), చంద్రన్నతోపాటు ఎస్‌జెడ్‌సీ, డీవీజీఎం స్థాయి నేతలు, వారి వెంట కేడర్‌ లొంగిపోయారని విమర్శించింది. సాయుధ విప్లవ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని, ఇలాంటి ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని, ఎన్నో త్యాగాలు చేయడంతోనే పార్టీ ఇప్పటికీ నిలిచి ఉందని పేర్కొంది. 

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా మారుతున్నాయని ఈస్టర్న్‌ బ్యూరో అభిప్రాయపడింది. సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో (దండకారణ్యం)లో ఇప్పటికీ నిలిచిన లీడర్లు, కేడర్‌ విప్లవ పోరాటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చింది.  

లేఖ ‘ఈస్టర్న్‌’ మిసిర్‌ బెహ్రాదే..: మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌గా నంబాల కేశవరావు బతికి ఉన్నంత వరకు ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల వేణుగోపాల్, తిప్పి రి తిరుపతి, మిసిర్‌ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఇందులో మల్లోజుల వేణుగోపాల్‌ ఇటీవల ఆయుధాలతో సహా లొంగిపోయాడు. తిప్పిరి తిరుపతి సాయుధ పోరాట పంథావైపు ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఆది నుంచీ ముప్పాళ్లది సాయుధ పోరాట పంథానే, మిగిలిన మిసిర్‌ బెహ్రా స్పందన ఏమిటనేది ఇంత కాలం సస్పెన్స్‌గా ఉంది. 

తాజాగా ఈస్టర్న్‌ రీజినల్‌ బ్యూరో పేరుతో వచ్చిన లేఖను మిసిర్‌ బెహ్రానే జారీ చేసినట్టు ఆ పార్టీ సానుభూతిపరులు అంచనా వేస్తున్నారు. దీంతో పార్టీ నాయకత్వంలో అగ్రభాగా న ఉండే పొలిట్‌బ్యూరో మెజార్టీ నాయకత్వం సాయుధ పోరా ట పంథానే ఎంచుకుందని తెలుస్తోంది. లొంగుబాట్లకు పార్టీ అగ్రనాయకత్వం అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచి్చన తెలంగాణ/ఏపీ నాయకత్వానికి తాజా పరిణామాల వల్ల సవాల్‌ ఎదురవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)