Breaking News

అక్కడక్కడా భూప్రకంపనలు

Published on Tue, 05/06/2025 - 05:54

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. జగిత్యాల జిల్లాలో సుమారు మూడు సెకన్ల నుంచి ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. 

రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మూడు నుంచి నాలుగు సెకన్లు కంపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ముందుగా ఉరుములతోనని అనుకున్న ప్రజలు.. భూకంపమని తెలుసుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో రాజుకు చెందిన పెంకుటిళ్లు పైకప్పు భూకంపం ధాటికి కూలిపోయింది. 

⇒ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం పులికుంట కేంద్రంగా సాయంత్రం 6.50 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని లక్ష్మణచాంద, పెంబి, ఖానాపూర్, దస్తూరాబాద్, జన్నారం, లక్సెట్టపేట, దండేపల్లి మండలాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. టేబుల్‌పై ఉన్న గ్లాసు కింద పడిందని జన్నారం మండలం పొనకల్‌ శ్రీలంక కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జాడి రాజన్న తెలిపారు. తపాలపూర్‌లో అంట్ల స్టాండ్‌ నుంచి గ్లాసులు కింద పడినట్టు విజయధర్మ తెలిపారు.  

– సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటతోపాటు దుబ్బాక పట్టణంలో సాయంత్రం 6.45 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో స్వల్పంగా భూమి కంపించినట్టు గ్రామస్తులు తెలిపారు.   

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)