Breaking News

ముందు 4 కోర్సులతో మొదలు

Published on Wed, 07/23/2025 - 04:50

సాక్షి హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మైనింగ్‌ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా ఉన్నతీకరించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగు ప్రధాన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 312 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వర్సిటీకి ప్రభుత్వం దివంగత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టడం తెలిసిందే. ఈ వర్సిటీలో స్థానిక పరిస్థితులు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కోర్సులు అందించనున్నారు. తొలి దశలో జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. 

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) పరిధిలోనే కోర్సుల ప్రవేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ‘దోస్త్‌’ప్రత్యేక విడత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ అంశంపై వర్సిటీ తాత్కాలిక వీసీ, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు బుధవారం కొత్తగూడెంలో సమీక్షించనున్నారు. 

ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఫిజిక్స్, కెమెస్ట్రీ నేపథ్యంతో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. తదుపరి దశల్లో ప్లానెటరీ జియాలజీ, జియోమార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, మినరాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ జియాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. 

ఉపాధి అవకాశాలే లక్ష్యం 
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి గనులున్నాయి. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉంది. నవభారత్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్‌ మైన్స్‌ వంటివి కూడా అక్కడే ఉన్నాయి. దీంతో ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సులు పరిశోధన స్థాయికి చేరువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్లాసులను సైతం అందించే వీలుందని అధికారులు అంటున్నారు. దీంతో యువతకు ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)