Breaking News

అక్రమాలు అరికట్టేందుకు ‘ఈ మొబైల్‌ మైనింగ్‌ యాప్‌’

Published on Sun, 10/01/2023 - 03:29

సాక్షి, హైదరాబాద్‌:  మైనింగ్‌ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈ మొబైల్‌ మైనింగ్‌ యాప్‌’కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ)తో కలసి గనులు, భూగర్భ వనరుల శాఖ రూపొందించిన మొబైల్‌ యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డీఎం కాత్యాయనిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖనిజాలు, ఇటుక, ఇసుక తదితరాల రవాణా సమయంలో తనిఖీలు చేసి అనుమతులు ఉన్నాయా లేదా? అనే అంశాన్ని గనుల శాఖ సిబ్బంది తక్షణమే తెలుసుకునేందుకు ఈ యాప్‌ దోహదం చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం, అనుమతులు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఖనిజాల తరలింపు.. తదితరాలకు అడ్డకట్ట వేయడంతో పాటు జరిమానాల విధింపునకు కూడా ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు.

జరిమానా విధింపు, చెల్లింపు అంశాల్లో పారదర్శకతతో పాటు, ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఖనిజ రవాణా సమాచారాన్ని డీలర్లు, లీజు హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అనుమతుల నిర్ధారణ కూడా ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ యాప్‌ ఉపయోగంలోకి వస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్‌ జియాలజిస్టులు, టెక్నీíÙయన్లు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లకు విధుల నిర్వహణ సులభతరమవుతుందని మంత్రి వెల్లడించారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)