Breaking News

'ఇంత త్వరగా విడుదలా?' అనుకునేలోపే.. మళ్లీ జైలుకే..!

Published on Sat, 07/18/2026 - 09:33

హైదరాబాద్‌: డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిన ఓ మందు బాబును చంచల్‌గూడ జైలు సిబ్బంది పొరపాటున శిక్ష పూర్తవకుండానే..తొమ్మిది రోజులు ముందే విడుదల చేశారు. చివరకు తప్పు తెలుసుకుని.. మళ్లీ అతన్ని ఒక రోజు తర్వాత జైలుకు తరలించారు. ఈ ఘటన కాచిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అంబర్‌పేటకు చెందిన మనోహర్‌ ఈ నెల మొదటి వారంలో మద్యం తాగి బైకు నడుపుతూ కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. 

అతన్ని 9వ తేదీన నాంపల్లి 8వ ఎంజేఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా రెండోసారి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. దీంతో మనోహర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 14 రోజులు జైల్లో పెట్టాల్సిన జైలు అధికారులు అతన్ని 5 రోజులకే విడుదల చేశారు. మరుసటి రోజు తప్పు గుర్తించిన జైలు అధికారులు మనోహర్‌ను తిరిగి జైలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో ఎట్టకేలకు మనోహర్‌ ఆచూకీ తెలుసుకుని..అయోమయానికి గురైన అతనికి జరిగిన తప్పిదాన్ని వివరించి..అతికష్టం మీద తిరిగి గురువారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)