Breaking News

మహిళా సాధికారతకు డ్రోన్ల దన్ను

Published on Thu, 03/06/2025 - 04:59

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాలు..తాజాగా డ్రోన్ల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వయం సహాయక సంఘాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా..వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగంలో వీరికి అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. 

వ్యవసాయ రంగానికి, రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా, సబ్సిడీ రేట్లపై ఈ సంఘాలకు డ్రోన్ల అందజేతకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు సాధించే విజయాలు, మహిళా సాధికారతకు డ్రోన్ల అందజేత ఏ మేరకు దోహదపడుతుందనే అంశాన్ని పరిశీలించిన తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. 

ఒక్కో మండలంలో ఒక్కో ఎస్‌హెచ్‌జీకి.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలానికి చెందిన ఒక గ్రూపును ఎంపిక చేసి జాతీయ పథకం కింద అమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. ఎస్‌హేచ్‌జీల్లోని మహిళా సభ్యులకు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఆర్థిక స్వావంబనతో పాటు రైతులకు తోడ్పాటును అందించాలనేది ఈ పథకం ముఖ్యోద్దేశం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి కేంద్రం ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయనున్నారు. 

కేంద్రం ఒక్కో డ్రోన్‌కు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తుండగా...అందులో 80 శాతం అంటే రూ.8 లక్షలు సబ్సిడీగా కవర్‌ కానుంది. మిగతా రూ.2 లక్షలు మండల మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. డ్రోన్లను సరైన పద్ధతుల్లో ఉపయోగించేలా ఎస్‌హేచ్‌జీలకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. డ్రోన్లు కేటాయించిన తర్వాత మహిళా సంఘాలు వీటిని రైతులకు అద్దెకు అందుబాటులో ఉంచుతాయి. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.  

కూలీల సమస్యకు చెక్‌ 
డ్రోన్లతో వరి, మామిడి, పత్తి, ఇతర పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లించడం ద్వారా రైతులకు కూలీల సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు. గతేడాది ఓ ప్రైవేట్‌ ఎన్జీవో సంస్థ...నిర్మల్‌ జిల్లాలోని కుబీర్‌ మండలానికి చెందిన ఇద్దరు మహిళలకు డ్రోన్లను అందజేయగా.. వాటిని వారు విజయవంతంగా నిర్వహిస్తూ రాబడిని పెంచుకున్న ఉదంతాన్ని ఓ అధికారి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు డ్రోన్లను అందజేయడం వల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మహిళా సాధికారతకు అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)