Breaking News

నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్‌టెల్‌ సిమ్, సీసీ కెమెరాలు..

Published on Mon, 05/29/2023 - 08:26

శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలోని పంటపొలాల్లో ఆదివారం విమానం ఆకారంలో ఉన్న డ్రోన్‌ పడిపోయింది. అదే సమయంలో ఆప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ మేకల కాపరి కొంత భయాందోళనకు గురయ్యాడు.

కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి చూసి ఆ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది యువకులు డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పగా, ఎస్‌ఐ సతీష్‌ అక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్‌టెల్‌ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ ఉన్నట్లు గుర్తించారు. 76 నంబర్‌తో ఉన్న ఈ డ్రోన్‌ రెక్కలపై ఎఫ్‌ఎల్‌216020220415099 నంబర్‌ ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్‌ 15 కిలోల బరువు ఉందన్నారు.

పంటపొలాల్లో పడిపోయిన ఈ డ్రోన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తర్వా­త బాంబ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. డ్రోన్‌లోని సిమ్‌కార్డును తీసి కనెక్ట్‌ చేసేందుకు యత్నించగా, సిమ్‌కార్డు కనెక్ట్‌కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: మరో రెండ్రోజులు ఉక్కపోతే..

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య