Breaking News

డ్రైవింగ్‌ పరీక్షలే లేకుండా లైసెన్సులు!

Published on Thu, 11/06/2025 - 08:23

సాక్షి, హైదరాబాద్‌: పరిమితికి మించిన వేగం. ర్యాష్‌ డ్రైవింగ్‌. ట్రాఫిక్‌ నిబంధనలపై కొరవడిన కనీస అవగాహన.‘డ్రైవింగ్‌ సెన్స్‌’ లేకుండానే భారీ వాహనాలతో దూకుడు.. శాస్త్రీయమైన శిక్షణ, నైపుణ్యం లేని నాసిరకం డ్రైవర్లు రవాణా రంగాన్ని హడలెత్తిస్తున్నారు. రహదారి భద్రతకే సవాల్‌ విసురుతున్నారు. డ్రైవింగ్‌ను ఉపాధిగా ఎంచుకొని ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్తతరం డ్రైవర్లు అరకొర నైపుణ్యంతోనే  లారీలు, టిప్పర్లు, ఆరీ్టసీ, ప్రైవేట్‌ బస్సులను నడుపుతున్నారు. అపరిమితమైన వేగంతో దూసుకెళ్తూ వాహనాలను  అదుపుచేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనలో ఓవర్‌లోడ్‌తో పాటు మితిమీరిన వేగంతో వస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి శిక్షణ, నైపు ణ్యం లేని ఇలాంటి  డ్రైవర్లకు  ఎల్‌ఎంవీ (లైట్‌మోటార్‌ వెహికల్‌), హెవీ (భారీ) వాహనాలను నడిపే డ్రైవింగ్‌ లెసెన్సులు అంగడి సరుకుల్లా లభించడం గమనార్హం. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన  డ్రైవింగ్‌ టెస్ట్‌ట్రాక్‌లు, ఆర్టీఏ అనుమతితో నడిచే డ్రైవింగ్‌ స్కూళ్లు, దళారులు మూకుమ్మడిగా అందుకు దోహదం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఇదొక వ్యవస్థీకృత కార్యకలాపంగా కొనసాగుతోంది.  

‘డబ్ల్యూ’అంటే వితౌట్‌ టెస్ట్‌.. 
సాధారణంగా టెస్ట్‌ ట్రాక్‌లలో పరీక్షలు  నిర్వహించి  డ్రైవింగ్‌ లైసెన్సులను అందజేస్తారు. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన రహదారులపైన  ఈ పరీక్షలు  నిర్వహిస్తుండగా  గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు, తెలంగాణ అంతటా ‘హెచ్‌’, ‘ఎస్‌’, ‘8’ ‘యూ’ వంటి  వివిధ ఆకారాల్లో రూపొందించిన ట్రాక్‌లలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నాగోల్‌ వంటి కొన్ని  ప్రధానమైన  టెస్ట్‌ట్రాక్‌లు మినహాయించి  మిగతా చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే  లైసెన్సులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం  వంటి కొన్ని శివారు కార్యాలయాల్లో ఈ దందా బాహటంగానే కొనసాగుతోంది. డ్రైవింగ్‌ స్కూళ్లు, దళారులు, ఏజెంట్‌ల ద్వారా వచ్చే అభ్యర్ధులకు  ఈ ‘డబ్ల్యూ’ లైసెన్సులు ఇస్తారు. ‘డబ్ల్యూ’ అనేది ఒక కోడ్‌. అంటే  ‘వితౌట్‌’ అని అర్థం. డ్రైవింగ్‌ పరీక్షలు లేకుండా  ఇచ్చే లైసెన్సులు ఇవి. దళారులు  వాహనదారుల నుంచి  ‘డబ్ల్యూ’ లైసెన్సుల కోసం అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు. 

  1. ‘సెన్స్‌’లెస్‌ డ్రైవింగ్‌... 
    టిప్పర్లు, లారీలు, డీసీఎంలు తదితర సరుకు రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్‌ బస్సులు నడిపేవారికి  రోడ్డు నియమాలపై సరైన అవగాహన ఉండడం లేదని నిపుణుల విశ్లేషణ. 

  2. ఈ తరహా డ్రైవర్లు ఒకవైపు భారీ వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడుతున్నారు. 

  3. మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ కిలోమీటర్ల కొద్దీ బండ్లను ముందుకు దూకిస్తున్నారు. 

  4. ఈ డ్రైవర్లలో ఏ మాత్రం ‘డ్రైవింగ్‌ సెన్స్‌’ ఉండడం లేదు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)