Breaking News

ఐఐటీ హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్‌ టెక్నాలజీ రెడీ

Published on Sun, 08/11/2024 - 06:31

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రైవర్‌ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్‌ లెస్‌ (అటానమస్‌ నావిగేషన్‌ డేటా అక్విజిషన్‌ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్‌ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆన్‌ అటానమస్‌ నావిగేషన్‌ (టిహాన్‌)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. 

ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్‌ లెస్‌ వాహనాలను ఐఐటీహెచ్‌లో వినియో­గిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్‌ లెస్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ, ట్రాఫిక్‌ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది. 

ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్‌ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ‘అటానమస్‌’ వాహనాల సాంకేతికతను టిహాన్‌ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్‌లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్‌ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు.  

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)