Breaking News

గుండెపోటుతో కూడా బస్సును అదుపు చేసి

Published on Sat, 01/07/2023 - 01:08

వెంకటాపురం(కె): టూరిస్ట్‌ బస్సుడ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. బస్సుకు బ్రేక్‌ వేయడంతో తక్కువ వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లింది.  ప్రయాణికులకు ఏమీ కాలేదు కానీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రయాణీకుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది శక్తి మాలలు ధరించి తీర్థ యాత్రల్లో భాగంగా  శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం పర్ణశాల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి బయలుదేరారు.

బస్‌డ్రైవర్‌ దేవ ఇరక్కమ్‌ (49) పర్ణశాల వద్ద నుంచే తనకు గుండె వద్ద నొప్పి వస్తోందని ఇబ్బందిగా ఉందని తెలిపాడు. దీంతో వేరే డ్రైవర్‌ను పిలిపించాలని ప్రయాణికులు సూచించారు. మరో డ్రైవర్‌ రావడానికి రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు తానే బస్సు నడుపుతానని చెప్పి యాదాద్రికి బయలుదేరాడు. అంకన్నగూడెం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌కు గుండెనొప్పి తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలాడు.

బస్సు నెమ్మదిగా ఉండడం, డ్రైవర్‌ నొప్పితో ఉన్నా బ్రేక్‌ వేయడంతో  బస్సు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. అపస్మారకస్థితిలో ఉన్న డ్రైవర్‌ను వెంటనే 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. బస్సులోని 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్‌ నొప్పి ఉన్నా సమయస్ఫూర్తితో బ్రేక్‌ వేశాడని, లేదంటే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)