Breaking News

నిరుపేద మెడిసిన్‌ విద్యార్థికి దాతల ఆర్థికసాయం

Published on Mon, 10/07/2024 - 04:46

వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దిపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని పానెం శ్రీహర్షిత ఇటీవల ప్రకటించిన మెడిసిన్‌ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించింది. ఆమె దీనస్థితిని గమనించి ‘సాక్షి’ ఈ నెల 3వ తేదీన ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో దాతలు విరివిగా స్పందించారు. ఇప్పటివరకు రూ. 1,10,000 ఆర్థిక సాయాన్ని శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. 

ఆదివారం ఖమ్మంకు చెందిన సత్యసాయి సేవా సమితి కన్వీనర్‌ ఎ.నర్సింహారావు, సభ్యులు నాగరాజు, సైదులు, సతీశ్‌లు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.30 వేలు విలువ చేసే వైద్యవిద్యకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అంతేకాకుండా కొణిజర్ల, బోనకల్‌ హెల్త్‌ సూపర్‌వైజర్లు వి.భాస్కర్‌రావు, ఎం.దానయ్యలు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. 

విజయవాడకు చెందిన మరో వైద్యుడు  నాలుగేళ్ల హాస్టల్‌ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్షిత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)