కాపురాల్లో మద్యం చిచ్చు

Published on Sat, 08/24/2024 - 05:20

సాక్షి, హైదరాబాద్‌: పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. ‘çమద్యం మత్తు’ కారణంగా కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి. గృహ హింసకు దారితీస్తున్నాయి. పోలీసు కేసులు, కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా నమోదవుతున్న కేసులకు కారణాలను పరిశీలిస్తే.. మద్యం అలవాటు తీవ్రత స్పష్టమవుతోంది. ఇక మరికొందరు తమ జీవిత భాగస్వామి ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటున్నారు. దీనితో మనస్పర్థలు ఏర్పడి సంసారం గందరగోళంలో పడిపోతోంది. 

అయితే గృహ హింస కేసులలో బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘సీడీఈడబ్ల్యూ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌)’ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లు ఈ సమస్యను కొంత దారిలోకి తెస్తున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులోకి తెచ్చిన 27 సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లలో ఇప్పటివరకు 34,090 కౌన్సెలింగ్‌ సెషన్లు నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 40 శాతం జంటలను తిరిగి కలిపారు.

మూడు నుంచి నాలుగు సిట్టింగ్‌లు
గృహ హింసకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పోలీసు అధికారులు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లకు అటాచ్‌ చేస్తున్నారు. ఈ సెంటర్లలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సిబ్బంది.. జంటలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కలహాలకు ప్రధాన కారణాలను తెలుసుకుంటారు. భార్య, భర్త ఇద్దరినీ కలిపి, విడివిడిగా మాట్లాడటంతోపాటు అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇలా మూడు, నాలుగు సార్లు కౌన్సెలింగ్‌ సెషన్లు నిర్వహిస్తారు. భార్యాభర్తలకు కలిపి, అవసరమైతే కుటుంబంతోనూ కలిపి కౌన్సెలింగ్‌ చేస్తారు. కలహాలకు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రోత్సహిస్తారు.

పెళ్లయిన ఐదేళ్లలోపే..
కుటుంబ కలహాల సమస్య యు వ జంటల్లోనే ఎక్కువగా ఉంటు న్నట్టు కేసులను బట్టి స్పష్టమవు తోంది. పోలీసు కేసులు, విడాకు ల వరకు వెళ్తున్న జంటల్లో.. పెళ్ల యి ఐదేళ్లు కూడా కానివారే 40% నికిపైగా ఉంటున్నారు. ఈ తర హా కేసులలో భార్యాభర్తల వయ సు 23 నుంచి 30 ఏళ్లలోపే ఉంటుండటం గమనార్హం.

⇒ విడాకుల వరకు వెళ్లేందుకు దారితీస్తున్న అంశాలు
⇒భాగస్వామి మద్యానికి బానిస కావడం 63%
⇒డబ్బులు, కట్నం కోసం డిమాండ్‌ చేయడం 49%
⇒భాగస్వామి ప్రవర్తనపై అనుమానం 47%

గృహ హింసకు కారణమవుతున్న అంశాలివీ..
⇒ వరకట్నం కోసం వేధింపులు ూ మద్యానికి బానిసకావడం
⇒ వివాహేతర సంబంధాలు ూ అత్తమామల వేధింపులు
⇒ జీవిత భాగస్వామిపై అనుమానం
⇒ కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు కావడం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)