Breaking News

బాలింత కడుపులో టవల్‌ వదిలేసిన వైద్యులు

Published on Wed, 06/25/2025 - 04:18

ఖమ్మం లీగల్‌: మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కడుపులో సర్జికల్‌ టవల్‌ వదిలేసిన ఖమ్మంలోని పీపుల్స్‌ నర్సింగ్‌హోం వైద్యులు పరిహారం, వైద్యఖర్చులు చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు తీర్పు చెప్పారు. మంగళవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఏదులాపురానికి చెందిన కాండ్రుకోట సౌమ్య ప్రసవం కోసం పీపుల్స్‌ నర్సింగ్‌హోం ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు 2021 డిసెంబర్‌ 1న శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలానికి సౌమ్య కడుపు నొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడటంతో వైద్యులు పరీక్షించి సాధారణ సమస్యగానే చెబుతూ మందులు ఇచ్చారు. 

అయినా, పరిస్థితి చక్కబడకపోవడంతో 2022 ఏప్రిల్‌ 1న అదే ఆస్పత్రికి వెళ్తే స్కాన్‌ చేయించి మరో డాక్టర్‌ వద్దకు పంపించారు. అక్కడి వైద్యులు కడుపులో రాయి వంటి పదార్థాన్ని గుర్తించడంతో సౌమ్య పీపుల్స్‌ నర్సింగ్‌హోం వైద్యులకు ఫోన్‌లో చెబితే కలిసే అవకాశం ఇవ్వలేదు. ఆపై ఏప్రిల్‌ 4న ఆమె తీవ్ర అస్వస్థతకు గురికాగా మరో ఆస్పత్రిలో ఏప్రిల్‌ 6న ఆపరేషన్‌ చేయడంతో సౌమ్య కడుపులో 15X20 సైజులో సర్జికల్‌ టవల్‌ బయటపడింది.

దీంతో ఆమె జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. కేసు వివరాలు పరిశీలించాక వైద్య ఖర్చుల కింద రూ.1,35,533ను 8 శాతం వడ్డీతో చెల్లించాలని.. పరిహారం, మానసిక వేదన, ఇబ్బందుల కింద రూ.5 లక్షలు, కేసు ఖర్చుల కింద రూ.40 వేలను ఖమ్మం పీపుల్స్‌ నర్సింగ్‌హోమ్‌ చెల్లించాలని మంగళవారం తీర్పు ఇచ్చారు.  

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)