Breaking News

నువ్వు అందంగా ఉన్నావు...

Published on Mon, 04/07/2025 - 11:44

ఖమ్మంవైద్యవిభాగం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.... తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్‌లా ఉన్నావు.. బొద్దుగా కనిపిస్తున్నావు..’ అంటూ ఓ వివాహితతో ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. చేయి విరిగిన ఆమె సర్జరీ కోసం రాగా.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో హహిళ భయబ్రాంతులకు గురికాగా.. ఘటనపై వివాహిత బంధువులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

వైరా నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో పనులు చేస్తుండగా కిందపడటంతో చేయికి తీవ్రంగా గాయమైంది. సమీపంలోని ఆర్‌ఎంపీని సంప్రదిస్తే చేయి విరిగిందని నిర్ధారించి ఖమ్మంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపాన శివ ఆర్థోపెడిక్‌ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ పరీక్షించాక సర్జరీ చేయాలని చెప్పడంతో గత గురువారం ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం సర్జరీ చేసేందుకు నిర్ణయించగా, ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లాక సదరు మహిళపై సిబ్బంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆపై ఆపరేషన్‌ చేయడానికి వైద్యుడు కూడా అదే మాదిరి ప్రవర్తించాడు. కేస్‌షీట్‌లో వివరాలన్నీ ఉన్నా వయస్సు ఎంత అని అడిగి చెప్పగానే అంత వయస్సులా కనిపించడం లేదు... అందంగా ఉన్నావు... తెల్లగా, వయస్సు తక్కువగా కనిపిస్తున్నావు... అంటూ మాట్లాడడంతో ఆమె భయాందోళనకు గురైంది.

ఆ తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కుటుంబీకులకు చెప్పడంతో డాక్టర్, సిబ్బందిని నిలదీస్తే అలాంటిదేమీ బుకాయించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్నా ఇష్టపడని మహిళను డిశ్చార్జ్‌ చేయించి తీసుకెళ్లాపోయారు. కాగా, ఘటనపై ఆస్పత్రి యాజమాన్యానికి వివాహిత కుటంబీకులు ఫిర్యాదు చేయగా, ఆమె ఆరోగ్యం చక్కబడ్డాక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)