Breaking News

అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు

Published on Sun, 10/26/2025 - 04:42

సిటీ కోర్టులు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు లేదా సంస్థలు ఆయన పేరు, ఫొటోలు, స్వరాన్ని (వాయిస్‌) వాడొద్దని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తన పేరును వాడుతున్నారని, దాని వల్ల తన పరువుకు భంగం కలిగే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో కూడా ఇలాంటివి జరుగకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని సిటీ సివిల్‌ కోర్టులో చిరంజీవి పిటిషన్‌ దాఖలు చేశారు. 

తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆ¯న్‌లైన్‌ ప్లాట్‌ఫాంలపై వినియోగించడం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా మార్పులు చేసిన తన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తులు లేదా ఏ సంస్థలైనా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని శనివారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. 

ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీచేస్తూ అక్టోబర్‌ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ చిరంజీవి పేరును ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. చిరంజీవి వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

టెలివిజన్‌ చానళ్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు లాభాలను పొందే ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్‌ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా చూపించడం లేదా వక్రీకరించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)