Breaking News

దివ్య.. పరీక్ష రాస్తే విజయమే

Published on Wed, 03/12/2025 - 08:53

తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌–1, 2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సత్తాచాటారు. కొందరు అభ్యర్థులు ఇదివరకు గ్రూప్‌–4 (Group-4)ఫలితాల్లో ర్యాంకులు సాధించి ఆయా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.

ధర్మారం(ధర్మపురి):  ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్‌ – 2(Group-2) ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో 169వ ర్యాంక్‌ సాధించారు. కాళేశ్వరం జోన్‌ మహిళా విభాగంలో రెండో ర్యాంక్‌ సాధించారు. బంగారు ఆభరణాల పనిచేసే మోటపల్లి తిరుపతి–భారతి దంపతుల కూతురు దివ్య(Divya ). బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. 2019లో వీఆర్వోతోపాటు గ్రూప్‌ – 4 ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష రాశారు.

తొలుత వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలంలో పనిచేశారు. గ్రూప్‌– 4 పరీక్ష ఫలితాలు 2021లో ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంక్‌ సాధించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 317 జీవో కింద దివ్యను ధర్మారం తహసీల్దార్‌ కార్యాలయానికి జూనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. గ్రూప్‌ – 1 లక్ష్యంగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టిన ఆమె.. రెండు నెలల వ్యవధిలోనే గ్రూప్‌ –2, గ్రూప్‌ –1 పరీక్షలు నిర్వహించగా రెండింటికి ప్రిపేరయ్యారు. మంగళవారం విడుదలైన గ్రూప్‌– 2 ఫలితాల్లో సత్తా చాటారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)