జూన్‌ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ 

Published on Wed, 05/24/2023 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత సబ్సిడీ గొ­ర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. వ­చ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించను­న్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆ­యన ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథ­కంపై మంగళవారం డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో తలసా­ని సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాద­వ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్‌ డాక్టర్‌. ఎస్‌.రాంచందర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఈలోగా లబ్ధిదారులను తీసుకెళ్లి గొర్రెలు కొనేలా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు.  

రూ.500 కోట్లు విడుదల 
కాగా, గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులను ఇవ్వడంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది.

రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు గాను ఆర్థిక శాఖ బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లలో పశుసంవర్ధక శాఖ అధికారులున్నారు. కాగా, రెండో విడత పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 5వ తేదీన మంత్రి తలసాని నల్లగొండలో ప్రారంభించనుండగా, అదే రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభం కానుంది.

Videos

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!