Breaking News

కోటిమంది ఆడపడచులకు సారె : సీఎం రేవంత్

Published on Tue, 12/02/2025 - 15:05

సాక్షి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని  ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం తెలిపారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటింకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని, కోటి చీరలను  ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే అని తెలిపారు. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మార్చిలో  పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలన్నారు.

2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈనెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నామని ఆకార్యక్రమంలోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం.

తెలంగాణలో నూతనంగా  నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజమని దానిని పెద్ద సమస్యగా భావించొద్దనిల  అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని  పార్టీ నాయకులకు  సూచించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన  ఓట్ చోరీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నేషనల్ హెరాల్డ్ కేసుల పేరుతో కేంద్రం హడావుడి చేస్తుందన్నారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని  రేవంత్ రెడ్డి తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)