Breaking News

కుటుంబంలో చిచ్చు పెట్టిన సీరియల్‌..

Published on Sat, 08/23/2025 - 03:21

బయ్యారం: పచ్చని కుటుంబంలో టీవీ సీరియల్‌ చిచ్చుపెట్టింది. సీరియల్‌ చూస్తూ తన ను పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురైన భర్త.. భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడాన్ని గమనించిన కొడుకు కూడా పురుగు మంది తాగాడు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడిపుంజుల తండాకు చెందిన ధరావత్‌ రాజుకు మహబూబాబాద్‌ మండలం సాలార్‌ తండాకు చెందిన కవితతో పది సంవత్సరాల క్రితం రెండో విహమైంది.

అప్పటికే కవితకు వివాహం జర గగా మున్న (11) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుతో సహా ఆమె రాజుతో కోడిపుంజులతండాలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ జంటకు కుమార్తె భవ్యశ్రీ జన్మించింది. కాగా, గురువారం రాత్రి రాజు అన్నం పెట్టమని అడుగగా.. కవిత టీవీలో సీరియల్‌ చూస్తూ.. కొంత సమయం ఆగమని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు భార్య కవితతో వాదనకు దిగి చేయి చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఇరుగు, పొరుగువారు వచ్చి సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.

శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసు కుంటానని కవిత తమ వ్యవసాయబావి వద్దకు వెళ్లగా స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రాజు వ్యవసాయబావి వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న కవిత గడ్డిమందు తాగింది. ఇది చూసి ఆమె కుమారుడు మున్న కూడా గడ్డిమందు తాగాడు. స్థానికులు ఈ విషయం గమనించి ఇద్దరినీ మహబూబాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు మున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)