డిస్కంల నష్టాలు రూ.67,276 కోట్లు

Published on Mon, 02/17/2025 - 05:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థిక సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటేటా పేరుకుపోతున్న నష్టాలు కొండలాగా పెరిగి చివరకు డిస్కంలను దివాళా పట్టించేలా మారాయి. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్‌ / టీజీఎస్పీడీసీ ఎల్‌)లు రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. ఏటేటా పెరిగిపోతున్న రెండు డిస్కంల ఆర్థిక నష్టాలు 2023–24 నాటికి రూ.67,276.07 కోట్లకు ఎగబాకాయి.

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఇటీవల రెండు డిస్కంలు సమర్పించిన 2025–26కి సంబంధించిన డిస్ట్రిబ్యూ షన్‌ బిజినెస్, వీలింగ్‌ టారిఫ్‌ ప్రతిపాదనలపై విద్యుత్‌ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌ రావు లేవనెత్తిన పలు అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించాయి. 

నష్టాల్లో దక్షిణ తెలంగాణ డిస్కం టాప్‌
దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో వినియోగదారులకు విద్యు త్‌ సరఫరా చేసే టీజీఎస్పీడీసీఎల్‌ 2023–24లో రూ.4,909. 53 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. సంస్థ మొత్తం నష్టాలు రూ.47,239.15 కోట్లకు ఎగబాకాయి. ఇక ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా చేసే టీజీఎన్పీడీసీఎల్‌ 2023–24లో రూ.1441.18 కోట్ల నష్టాల ను చవిచూడగా మొత్తం రూ.20,036.92 కోట్లకు పెరిగిపో యాయి. అంటే, రెండు డిస్కంలు కలిపి 2023–24లో రూ.6350.71 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏటేటా నష్టాలు ఇదే తీరులో కొనసాగితే మరో ఐదారేళ్లలో నష్టాల మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

సర్కారు అదనపు సహాయం ఇస్తేనే..
పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్లు వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడం కోసం విద్యుత్‌ కొనుగోళ్లకు అధిక వ్యయం చేయడంతోనే భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని రెండు డిస్కంలు స్పష్టం చేశాయి. అయితే, ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు టీజీఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. వివిధ గ్రాంట్లు, పథకాల కింద ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తే నష్టాలను అధిగమిస్తామని టీజీఎన్పీడీసీఎల్‌ వివరించింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)