Breaking News

రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!

Published on Sat, 07/27/2024 - 05:58

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్‌ బాటిల్‌ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్‌ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.

మండల కేంద్రం కావడంతో..
మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్‌ కావడంతో క్యాష్‌ కౌంటర్‌లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్‌ కౌంటర్‌ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.

అనంతరం క్యాష్‌ కౌంటర్‌ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్‌ బాటిల్‌ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్‌లోంచి వాటర్‌ బాటిల్‌ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్‌ పాకెట్‌ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్‌ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)