Breaking News

కాళ్లు మొక్కుతాం సార్‌.. జీతాలివ్వండి

Published on Sat, 03/14/2026 - 11:57

సిరిసిల్లటౌన్‌: ‘కాళ్లు మొక్కుతాం.. ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఉంటారు’ అంటూ కొందరు దివ్యాంగులు రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం కాళ్లపై పడిన సంఘటన చర్చనీయాంశమైంది. శుక్రవారం డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సిరిసిల్ల మున్సిపల్‌ ఆఫీస్‌కు రాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌బంక్‌లో పనిచేసే దివ్యాంగ కార్మికులు తిరుపతి, లింగప్రసాద్, మన్మోహన్‌ తదితరులు అక్కడకు చేరుకుని జీతాలు ఇవ్వాలంటూ ఆయన కాళ్లపై పడ్డారు. అనంతరం దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ, 2024లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్‌ బంక్‌లో మొత్తం 24 మంది దివ్యాంగులను అప్పటి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నియమించారని తెలిపారు. 

అయితే సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షణలో నడిచే బంక్‌లో ఆకస్మికంగా కొందరు దివ్యాంగులైన వర్కర్లను తొలగించి, పది మంది మాత్రమే ఉండాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు లెక్కచేసి ఇవ్వాలని కోరగా.. ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పినా కనికరించడం లేదని వాపోయారు. దివ్యాంగులపై డీడబ్ల్యూవో నిర్దయగా ప్రవర్తించడం సరికాదన్నారు. పది నెలలుగా జీతాలు లేవని, సీఎం రేవంత్‌రెడ్డి తమపై కరుణ చూపి న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)