Breaking News

తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ

Published on Sun, 12/29/2024 - 14:42

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారని డీజీపీ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.

క్రైమ్‌ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేస్తూ.. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ తెలిపారు. డ్రగ్స్‌ లేని తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని.. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న డీజీపీ.. డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.

ఈ ఏడాది 33,618 సైబర్‌ క్రైమ్‌ కేసులను నమోదయ్యాయి.703 చోరీ, 58 దోపిడీ, 1,525 కిడ్నాప్‌, 856 హత్య, 2,945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 పిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశాం’’ అని డీజీపీ జితేందర్‌ వివరించారు.

‘‘ఇల్లిగల్‌ ప్రైవేట్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశాం. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం.. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు.. ప్రైవేట్‌ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదు’’ అని డీజీపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నేరాల్లో మరో కోణం!

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)