Breaking News

డ్రగ్స్‌ సరఫరాపై కఠినంగా వ్యవహరించండి

Published on Fri, 10/11/2024 - 04:25

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఇన్‌ చార్జి సందీప్‌ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్‌ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.

రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్‌ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్‌ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్‌ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.

నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్‌ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ మహేశ్‌భగవత్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)