Breaking News

త్యాగాల నుంచే గొప్ప విజయాలు

Published on Sun, 10/22/2023 - 04:12

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): పౌరులకు అందించే పోలీసు సేవల్లో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శనివారం గోషామహల్‌ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాల నుంచే గొప్ప విజయాలు లభిస్తాయని అన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

షీటీమ్స్, భరోసా కేంద్రాలు, పాస్‌పోర్టు క్లియరెన్స్, సీసీటీవీ ప్రాజెక్టుల నిర్వహణ వంటి విషయాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, శిశుసంక్షేమం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుతూ వస్తోందని, తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

పౌర రక్షణ విధులలో అమరులైన 189 మంది పోలీసులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘అమరులు వారు’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, అడిషనల్‌ డీజీలు సౌమ్యమిశ్రా, శివధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ జైన్, మహేశ్‌ భగవత్‌లతో పాటు పలువురు సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)