Breaking News

1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా

Published on Wed, 06/03/2026 - 03:58

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని 1.15 కోట్ల కు టుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దిన వేడుకల సందర్భంగా ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.15 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా గ్రీన్‌ ఎనర్జీ పాలసీ 2025ని ప్రవేశపెట్టామని వివరించారు. తెలంగాణలో పుట్టడం, జీవించడం వరమనేలా ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రెండో విడతగా నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించిన భట్టి.. కొందరికి ఇళ్ల మంజూరు పట్టాలు అందజేశారు. 

81 గ్రామాలకు సోలార్‌ ప్యానళ్లు: గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేందుకు మోడల్‌ సోలార్‌ గ్రామాల కార్యక్రమం చేపట్టినట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలో తొలివిడతగా 81 గ్రామాలను ఎంపిక చేసి ప్రతీ ఇంటికి 2 కిలోవాట్లు, వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ల ప్యానళ్లను రూ.1,380 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల్లోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తొలి రెండున్నరేళ్లలోనే రూ.60 వేల కోట్ల రుణాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. 

ఇక ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్‌ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోందని తెలిపారు. తొలుత ఖమ్మంలోని అమరవీరుల స్తూపం వద్ద భట్టి నివాళి అరి్పంచగా, కలెక్టర్‌ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో భట్టి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు మ్యాపింగ్‌లో ఉందా, అన్‌మ్యాపింగ్‌లో ఉందో తెలుసుకోవాలని సూచించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)