Breaking News

గత సర్కార్‌ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది

Published on Sun, 12/28/2025 - 05:16

నేలకొండపల్లి: గత పాలకులు ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినా.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో రూ.2.25 కోట్లతో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను శనివారం ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.1.75 కోట్లతో నిర్మించనున్న మరో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ప్రతీ సంవత్సరం రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.

96 లక్షల పేద కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. గత సర్కారు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తే.. తాము ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

సన్న ధాన్యానికి దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత పాలకులు దోచుకుని రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని విమర్శించారు. పేదల ముఖంలో ఆనందం చూడాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న 
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)