Breaking News

ఇంత సోమరితనమా?

Published on Sun, 08/11/2024 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: ‘జలవిద్యుత్‌ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్‌ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.

జలవి ద్యుత్‌ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్‌’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్‌కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తదితర జలవిద్యుత్‌ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. 

మనసుపెట్టి పనిచేయండి.. 
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్‌కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్‌ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్‌ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్‌ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్‌ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

‘విద్యుత్‌’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. 
విద్యుత్‌ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు