Breaking News

దేశంలోకెల్లా ‘ఇంటి’కి రూ.5 లక్షల ఘనత మాదే

Published on Fri, 05/30/2025 - 06:00

ఖమ్మం సహకారనగర్‌: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలపై గురువారం డిప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. 

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, వ్యవసాయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 22,500కోట్లు మంజూరు చేశామని.. ఏకకాలంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్‌ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వానాకాలం సీజన్‌ వచ్చినందున నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని భట్టి సూచించారు. సాదాబైనామా దరఖాస్తుల్లో కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న వాటిని తక్షణమే తిరస్కరించాలన్నారు. కోర్టు స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 

వచ్చే నెల 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్‌ ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్‌ వి.పాటిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గించాలి: కూనంనేని 
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. తద్వారా అర్హులెవరికీ అన్యాయం జరగదన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే ఇందిరమ్మ కమిటీలు, అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండేలా చూడాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. దివంగత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాం తర్వాత ఇప్పుడే ఇళ్లు మంజూరు చేస్తున్నందున అర్హులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇసుక కొరత లేకుండా పర్యవేక్షించాలన్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)