Breaking News

అలైన్‌మెంట్‌ మార్చండి.. పరిహారం పెంచండి

Published on Tue, 09/30/2025 - 01:41

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో అలైన్‌మెంట్‌ మార్చడంతోపాటు భూ పరిహారం పెంచాలంటూ నిర్వాసితులు ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్‌–సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో సమస్య నివురుగప్పిన నిప్పులా ఉంది. చౌటుప్పల్‌కు కనీసం 50 కి.మీ. ఆవల ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుందని తొలుత చెప్పి చివరకు పట్టణానికి 25 కి.మీ. దూరంలోనే అలైన్‌మెంట్‌ ఖరారవడం వెనుక ఓ బడా పరిశ్రమను కాపాడే ఉద్దేశం దాగి ఉందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. 

ముందుగా అనుకున్న అలైన్‌మెంట్‌ ప్రకారం ఆ పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌ లోపలివైపు అవుతుందని.. ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి వైపు ఉన్న పరిశ్రమలను అవతలి వైపు తరలించాలన్న అంశం తెరపైకి వచ్చినట్లుగానే భవిష్యత్తులో ఆర్‌ఆర్‌ఆర్‌ లోపలి వైపు ఉన్న పరిశ్రమలను సైతం దూరంగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ పరిశ్రమకు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో అధికారులు అలైన్‌మెంట్‌ మార్చారని నిర్వాసితులు వాదిస్తున్నారు. 

దీనికితోడు గతంలో జాతీయ రహదారి కోసం భూమి కోల్పోయి, ఆ తర్వాత డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌ కోసం భూమి కోల్పోయి, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కూడా భూమి కోల్పోతే ఇక తమకు మిగిలేదేమి ఉంటుందని నిర్వాసితుల్లో ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ ప్రభుత్వం పరిహారమన్నా ఎక్కువ ప్రకటించిందా అంటే భూముల ధరలతో పోలిస్తే ఎనిమిదో వంతు కూడా లేదని వారు వాపోతున్నారు. త్వరలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడితో ఆందోళనను మరోసారి ఉధృతం చేస్తామని చెబుతున్నారు. 

సంగారెడ్డి వద్ద కూడా.. 
సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న సదాశివపేట్, కొండాపూర్‌ మండలాల్లోని ఆర్‌ఆర్‌ఆర్‌ భూ నిర్వాసితుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌కు చేరువగా ఉండే ప్రాంతాల్లో ఒక్కో ఎకరం మార్కెట్‌ రేటు ప్రకారం రూ. 2–3 కోట్ల దాకా పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రం రూ. 30 లక్షల్లోపే ఉంటుందన్న ప్రచారం జరగడంతో ఈ ధరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు.

 పరిహారం పెంపు కోసం గతంలో ఆందోళనలు చేసిన నిర్వాసితులు తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేతో వారు చర్చించగా పరిహారాన్ని పెంచాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టాలని ఆయన సూచించారు. 

రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ నేతలు 
ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోందన్న వార్తలు వస్తుండటంతో కొందరు కాంగ్రెస్‌ నేతలు భూ నిర్వాసితుల ఆందోళనకు తెరదించేలా అనుకూల ప్రచారం ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో భూముల ధరల పెంపు ఎంత ఉన్నా రింగు అలైన్‌మెంట్‌ పరిధిలోకి వచ్చే భూముల ధరలను మాత్రం ప్రభుత్వం భారీగా పెంచనుందని.. అందువల్ల ఆందోళనకు దిగొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  

పోలీసు సహకారం తీసుకోనున్న ఎన్‌హెచ్‌ఏఐ.. 
వచ్చే నెలలో సుమారు రూ. 2 వేల కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి భూములను అ«దీనంలోకి తీసుకోవడానికి ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి పంటలు వేసుకున్న భూములను వదిలేసి మిగతా వాటిని స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమవుతోంది. గెజిట్‌ విడుదలతో సాంకేతికంగా ఆ భూములన్నీ ఎన్‌హెచ్‌ఏఐ అధీనంలోకి వచి్చనప్పటికీ భౌతికంగా వాటిని స్వా«దీనం చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో నిర్వాసితులు ఆందోళన చేసే అవకాశం ఉన్నందున పోలీసుల సహకారం తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)