Breaking News

‘వెటర్నరీ’ వీసీ ఎంపిక ఎప్పుడో?

Published on Sun, 02/16/2025 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎంపికలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. రెండుసార్లు సెర్చ్‌ కమిటీలు భేటీ అయినా వీసీని ఎంపిక చేయలేదు. అయితే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని ఓ వ్యక్తి తన బంధువు కోసం చక్రం తిప్పుతున్నారా? వెటర్నరీ యూనివర్సిటీలో ఎవరిని కదిపినా ఇవే ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలకు ఒకేరోజు వీసీలను ఎంపిక చేసి.. ఆ జాబితాను గవర్నర్‌ ఆమోదానికి సీఎం పంపిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో వెటర్నరీ వర్సిటీ వీసీ పేరు లేదు.  

» గత డిసెంబర్‌ 28న తొలిసారిగా సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు వెటర్నరీ వర్సిటీ వీసీ, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్‌ గోపీ, ఐసీఏఆర్‌ నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాఘవేంద్ర భట్‌తో కూడిన ఈ కమిటీ అదే రోజు సమావేశమై వీసీ పోస్టుకు అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రభుత్వానికి పంపించింది. కానీ ఆ సెర్చ్‌కమిటీ ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎంపిక చేయలేదు.  

»  ఈ ఏడాది ఫిబ్రవరి 5న మరోసారి వీసీ ఎంపిక కోసం సెర్చ్‌ కమిటీ సమావేశమైంది. ఆరోజు నుంచి ఇప్పటివరకు వీసీ ఎంపిక ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. రెండో విడత సమావేశమైన సెర్చ్‌ కమిటీ ఇచి్చన పేర్లలో ముఖ్యమంత్రి ఒకరిని ఎంపిక చేసి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్‌ ఆమోదముద్రతో వీసీ నియామకం అధికారికంగా జరుగుతుంది.  

అయితే యూనివర్సిటీల చరిత్రలో రెండోసారి సెర్చ్‌ కమిటీ సమావేశమై అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపినా, వీసీ ఎంపికపై ఏ నిర్ణయమూ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి ఒకరు వీసీ నియామక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని వెటర్నరీ వర్సిటీలో చర్చ జరుగుతోంది. వి శ్వసనీయ సమాచారం ప్రకారం వీసీ రేసు లో ప్రొఫెసర్లు చంద్రశేఖర్, పురుషోత్తం, కొండల్‌రెడ్డి, జ్ఞానప్రకాశ్‌ ఉన్నట్టు తెలిసింది.   

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)