Breaking News

వేతనాలు ఎప్పుడు ఇస్తారు?

Published on Fri, 11/07/2025 - 03:29

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రెగ్యులర్‌ ఉద్యోగులకు ఐదో తేదీలోపు వేతనాలు అందుతుండగా.. ఇతర ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్‌ విధానంలో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే వేతనాలు ఇస్తోందని, అయితే వాటిని కూడా నెలల తరబడి నిలుపుదల చేయడంతో కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీఓఈ)ల్లో దాదాపు ఐదు వందల మందికి పైగా సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌ పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు వేతనాలు అందలేదు. 

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి వీరిని నియమించుకున్న సొసైటీలు.. ఇప్పటికీ వేతనాలు విడుదల చేయలేదు. ఈ అంశంపై సొసైటీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయా సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు గురుకులాల్లో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లు, బోధనేతర సిబ్బంది, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు విడుదల కాలేదు.  

సొసైటీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు.. 
ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో వారంతా సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సైతం వేతన చెల్లింపుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి నెలా చెల్లింపుల్లో జాప్యం జరగడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

వేతన చెల్లింపుల సమస్య పరిష్కరించాలని చాలారోజులుగా సొసైటీ కార్యాలయానికి వస్తున్నా.. కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు వేతన చెల్లింపుల అంశాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పడంతో అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు వేతనాలు అందడం లేదని ఉద్యోగులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నట్టు తెలిసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)