Breaking News

గుట్టలతో గాలివాటానికి అవాంతరం

Published on Wed, 05/21/2025 - 04:27

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ విమానాశ్రయంతోపాటే పనులు ప్రారంభిద్దామనుకున్న కొత్తగూడెం విమానాశ్రయ కసరత్తుకు అవాంతరం ఎదురైంది. విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావించి గుర్తించిన స్థలం పనికిరాదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) తేల్చిచెప్పింది. దీంతో కొత్తగూడెం విమానాశ్రయానికి మరో స్థలం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దీని నిర్మాణ కసరత్తులో జాప్యం తప్పేలా కనిపించటం లేదు.   

ముచ్చటగా మూడో స్థలం కోసం.. 
రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల్లో కొత్తగూడెం కూడా ఒకటి. ఇందులో వరంగల్‌ శివారులోని మామునూరు పాత ఎయిర్‌స్ట్రిప్‌ ఉన్న స్థలంలో భారీ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దాని తర్వాత రెండో విమానాశ్రయంగా కొత్తగూడెంను ముందుకు తెచ్చారు. ప్రతిపాదించిన సమయంలో తొలుత పాల్వంచ సమీపంలోని గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని గుర్తించారు. 

అది అనుకూలంగా లేదని ఏఏఐ తేల్చటంతో గతేడాది చివరలో కొత్తగూడెం మండలంలోని రామవరం, సుజాతనగర్‌ మండలం పరిధిలో సుజాతనగర్‌ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామాల సరిహద్దులో 950 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పదేళ్ల వాతావరణ నివేదికలు, విండ్‌రోజ్‌ డయాగ్రామ్‌ తదితర నివేదికలను స్థానిక అధికారులు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి నివేదించారు. వీటితోపాటు ఆ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన ఏఏఐ అధికారులు.. ఆ భూమి కూడా యోగ్యంగా లేదని తేల్చి ఉసూరుమనిపించారు. 

ప్రతిపాదిత స్థలంలో 2800 మీటర్ల రన్‌వేను నిర్మించాల్సి ఉంది. ఇది తూర్పు–పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ రన్‌వేను 10/28 పద్ధతిలో ల్యాండింగ్, టేకాఫ్‌ రెండింటికీ ఉపయోగపడేలా నిర్మించాలని నిర్ణయించారు. కానీ, రన్‌వేకు ఉద్దేశించిన ప్రాంతానికి కొంత చేరువగా ఎత్తయిన గుట్టలున్నాయి. అవి గాలి వాటాన్ని అడ్డుకోవటం ద్వారా విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లపై ప్రభావాన్ని చూపుతాయని అథారిటీ తేల్చింది. 

తొలుత చిన్న విమానాలకు సరిపడే ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని భావించినా, వరంగల్‌ తరహాలో వేయి ఎకరాల్లో ఎయిర్‌బస్‌ విమానం దిగగలిగే రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించాలని నిర్ణయించారు. కానీ, కొత్తగూడెం ప్రాంతం యావత్తు గుట్టలతో నిండి ఉన్నందున అంత పెద్ద విమానాశ్రయానికి అనువైన స్థలం లభించే విషయంలో ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)