Breaking News

42 ఏళ్ల లారీడ్రైవర్‌తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!

Published on Tue, 07/15/2025 - 09:05

వరంగల్: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్‌–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి  నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ విషయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే  ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్‌ ఫోన్‌ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న  యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)