Breaking News

లేడి.. రోడ్లపై పరుగిడి..

Published on Sat, 04/05/2025 - 07:33

గచ్చిబౌలి: రోడ్లపై పరుగులు తీసిన ఓ జింక ఎట్టకేలకు ఓ ఇంట్లోకు చేరింది.  పోలీసులు, ఫారెస్ట్‌ అధికారుల దాన్ని జూపార్క్‌కు చేర్చారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ జింక గోపన్‌పల్లి ఎన్‌టీఆర్‌నగర్‌లో రోడ్లపై పరుగులు తీయసాగింది. దీనిని కుక్కలు వెంబడించడంతో వాటి బారినుంచి స్థానికులు రక్షించారు.

 భయంతో అక్కడే ఉన్న ఓ హార్డ్‌వేర్‌ షాపులోకి వెళ్లింది. షాపు నిర్వాహకుడు సూరజ్‌.. దానికి చపాతీ తిపించారు. కొద్ది నిమిషాల అనంతరం అక్కడి నుంచి జింక పరుగుతీసి బస్తీలోకి వెళ్లింది. రాణి అనే మహిళ ఇంట్లో నుంచి కమల అనే మహిళ ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నవారు పనికి వెళ్లారు. గమనించిన స్థానికులు బయటకు వెళ్లకుండా గేట్‌ మూశారు. వి

షయం తెలుసుకున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు రవి కుమార్‌ యాదవ్‌ పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు జింక బయటకు రాకుండా చర్యలు చేపట్టి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందిచారు. ఎఫ్‌ఆర్‌ఓ రమేష్‌ కుమార్, వెటర్నరీ డాక్టర్‌ షానవాజ్‌ , నెహ్రూ జూలాజికల్‌ సిబ్బంది రెస్క్యూ వాహనంతో వచ్చారు. మొదట వల వేసి బంధించి ఇంటి నుంచి బయటకు రప్పించాలని చూడగా వారు అనుకున్న రీతిలో జింక స్పందించలేదు. దీంతో దానికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి రెస్క్యూ వాహనంలో జూ పార్క్‌కు తరలించారు.  

బెదిరి.. సమూహం నుంచి చెదిరి..  
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో జింకల సమూహాలు ఉన్నాయి. అవి గుంపులు గుంపులుగా ఒకచోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. గత నాలుగు రోజులుగా కంచ గచ్చి»ౌలి సర్వే నెంబర్‌ 25లో టీజీఐఐసీ చేపట్టిన పనుల కారణంగా జింకల సమూహాలు బెదిరి.. చెదిరిపోయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేసీబీల శబ్దాలు, చెట్ల నరికివేతతో భయంతో జింకలు కాంక్రీట్‌ జంగిల్‌లోకి పరుగులు తీస్తున్నాయి. జింకలు, వన్య ప్రాణుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం, ఫారెస్ట్‌ అధికారులపై ఉంది.  

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)