Breaking News

దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం

Published on Tue, 11/19/2024 - 03:01

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్‌ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. 

ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్‌ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్‌ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. 

మార్కెట్‌ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటు
భారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్‌హెచ్‌ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్‌ఆర్‌తో రేడియల్‌ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. 

ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్‌ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్‌ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు. 

అలాగే, రీజినల్‌ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్‌ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్‌ఎఫ్‌పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీని ఆదేశించింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)