Breaking News

కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు

Published on Wed, 05/29/2024 - 04:36

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అను మతులు ఇవ్వలేదని, తన వద్దకు ఎలాంటి దర ఖాస్తులు రాలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అనుమతులు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్‌ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని, రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను రూఢీ చేసుకోకుండా పత్రికలు తప్పుగా ప్రచురించాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎఫ్‌ఎల్‌) లావాదేవీలన్నీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జరుగుతాయని తెలిపారు. 

దీనికి టీజీబీసీఎల్‌ ఎండీ/ఎక్సైజ్‌ కమిషనర్‌ నేతృత్వం వహిస్తారన్నారు. రాష్ట్రంలో గత ఆరువారాలుగా వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని, బీర్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్‌ ఎండీ మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సోమ్‌ డిస్టిలరీస్‌ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్‌పై ప్రతిస్పందించారని తెలిపారు. కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)