Breaking News

అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని...

Published on Sun, 02/02/2025 - 13:06

తలమడుగు/తాంసి ఆదిలాబాద్ జిల్లా: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం, తాను అప్పు తీసుకున్న వారికి సమాధానం చెప్పలేక ఓ వ్యక్తి మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించి  . అందులో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, తలమడుగు ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్‌ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రాకేశ్‌ తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన తన మేనమామ వద్ద పెరిగాడు. 

 రాకేశ్‌కు ఆదిలాబాద్‌కు చెందిన లావణ్యతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కూతురు ప్రశస్త్య ఉంది. మొదట్లో ఆటో నడిపేవాడు. తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో మృతుడి మేనమామ–అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సాయి, స్పందన ఉన్నారు. వారు రాకేశ్‌ సంరక్షణలోనే ఉన్నారు. ఇద్దరూ ఉన్నతవిద్య అభ్యసించగా, సాయి బెంగ ళూరులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. స్పందన ఇటీవల నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసింది. 

రాకేందర్‌కు రూ.60 లక్షలు అప్పుగా..
ఆదిలాబాద్‌లోని విద్యానగర్‌ కాలనీలో 21 మంది సభ్యులతో కలిసి రాకేందర్‌ ఆర్‌కే సొసైటీని ప్రారంభించాడు. లావణ్య సైతం ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. అందులో కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అయితే ఆ సొసైటీ దివాలా తీసింది. అదే విధంగా రాకేందర్‌కు రూ.60లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాకేశ్‌–లావణ్య దంపతులు సూసైడ్‌ నోట్‌ రాశారు. బాకీ ఉన్న డబ్బుల వివరాలు కూడా అందులో పేర్కొన్నారు. రాకేందర్‌ తీసుకున్న ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివరించారు. దీంతో ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, బయట తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా రాకేశ్‌ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

సొంత చేనుకు వచ్చిన... 
శనివారం ఉదయం తలమడుగు మండలం ఉండం శివారులో ఉన్న తన సొంత చేనులో రాకేశ్‌(35), ఆయన భార్య లావణ్య, మరదలు స్పందన(19) పురుగు మందు తాగారు. ఆ తర్వాత లావణ్య జిల్లా కేంద్రంలో ఉండే తన బాబాయికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచి్చంది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాకేశ్, స్పందన చనిపోయారు. కొనఊపిరితో ఉన్న లావణ్యను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కూతురుకు తాగించేందుకు మందు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌