పట్టుతప్పిన పౌర సేవలు

Published on Fri, 05/02/2025 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖలో పదోన్నతులపై ప్రతిష్టంభన నెలకొనడంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఆరు నెలలకుపైగా ఇన్‌చార్జుల ఏలుబడిలో కొనసాగుతున్నాయి. దీంతో పౌరసేవల నిర్వహణలో వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. పరిపాలన అధికారులు, ఉద్యోగులకు, మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్లకు నడుమ సమన్వయం  లేకపోవడంతో పలుచోట్ల డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు, ఫిట్‌నెస్‌ పరీక్షలు, యాజమాన్య బదిలీ వంటి పలు సేవల్లో వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అన్ని చోట్ల ఏజెంట్ల కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

అసిస్టెంట్లకు అడ్డాలుగా.. 
వాహనదారులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకొని ఫీజులు చెల్లించినప్పటికీ  లెర్నింగ్‌ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైళ్లు సత్వరమే పరిష్కారమవుతుండగా, స్వయంగా వెళ్లే వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు  మధ్యవర్తులకు ప్రధాన అడ్డాలుగా మారాయి. 

జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు నిర్వహించాల్సిన  విధుల్లో వాళ్లకు అసిస్టెంట్లుగా వ్యవహరించే దళారులే స్వయంగా ఆఫీసుల్లో తిష్టవేసి పనులు కానిస్తున్నారని హబ్సిగూడకు చెందిన ఓ వాహనదారు విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టిఓలు విధులు నిర్వహించే చోట ఇలా ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లో పాగా వేసే పరిస్థితి లేదు. ప్రాంతీయ రవాణా అధికారుల పర్యవేక్షణ లేని కొన్ని కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా మారింది. 

కొర్రీలతో బెంబేలెత్తించి..  
మరోవైపు కొన్ని రవాణా కేంద్రాల్లో  దళారుల ప్రమేయం లేకుండా వెళ్లే వాహనదారులను సిబ్బంది రకరకాల కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇటీవల కూకట్‌పల్లి యూనిట్‌ కార్యాలయంలో కొత్త ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్‌ కోసం స్వయంగా వెళ్లిన వ్యక్తిని సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వాహనానికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు సహా  దరఖాస్తు స్వీకరించి రసీదు అందజేసి.. నాలుగు రోజులైనా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో  సదరు  వాహనదారు అధికారులను సంప్రదించారు. 

చిరునామా ధ్రువీకరణ కోసం విద్యుత్‌ బిల్లు, అఫిడవిట్‌ వంటి ఆధారాలను అందజేసినప్పటికీ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ జత చేస్తే తప్ప ఫైల్‌ను అప్రూవల్‌ చేయలేమని చెప్పడంతో సదరు వాహనదారు విస్తుపోయారు. సాధారణంగా  దళారుల ద్వారా వస్తే  ఇలాంటి డాక్యుమెంట్‌లు  అవసరం లేకుండానే  పనులు పూర్తి చేసి పంపిస్తారు. కానీ స్వయంగా వెళ్లేవాళ్లకు మాత్రం ఇలాంటి కొర్రీలు తప్పడం లేదు.  

అడ్రస్‌లు ఏమారుస్తారు..  
కొన్ని కార్యాలయాల్లో దళారులు యథేచ్ఛగా నకిలీ చిరునామాలను సృష్టించి  డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల బదిలీలు, రిజిస్ట్రేషన్లు వంటి పనులు చేయిస్తున్నారు. తప్పుడు చిరునామాలపై ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్సులు ఇవ్వడం, వాహనాల రిజి్రస్టేషన్‌ చేయడంతో ప్రభుత్వం  అందజేసే విలువైన డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)