Breaking News

ఉపకార దరఖాస్తుకు గడువు మార్చి 31

Published on Thu, 01/01/2026 - 04:05

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్‌ 31తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ ఇంకా 40 శాతం మంది విద్యార్థులు దర ఖాస్తులు చేసుకోకపోవడం... మరోవైపు కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. 

దీంతో ఏకంగా 3 నెలలపాటు గడువు పొడిగిస్తూ మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పొడిగింపును విస్తృతంగా ప్రచారం చేయాలని సంక్షేమ శాఖల అధికారులు, కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు.  

కాలేజీల చొరవే కీలకం: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తులో కాలేజీ యాజమాన్యాలే చొరవ తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సగటున 12.65 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

2025–26 విద్యా సంవత్సరంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెపె్టంబర్‌లో ప్రారంభమైంది. 4 నెలల పాటు అవకాశం కల్పించినప్పటికీ 7.85 లక్షల మంది మాత్రమే ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మరోవైపు పీజీఈసెట్‌–2025, లాసెట్‌–2025 తదితర 4 సెట్‌లకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈనెలాఖరు వరకు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కానుంది.  

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)