Breaking News

ఫార్మసీల్లో పీవీపీఐ క్యూఆర్‌ కోడ్‌ ప్రదర్శన తప్పనిసరి

Published on Sun, 11/23/2025 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు వినియోగించే ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను త్వరితగతిన గుర్తించేందుకు, దేశవ్యాప్తంగా ఫార్మాకోవిజిలెన్స్‌ చర్యలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రిటైల్, హోల్‌సేల్‌ మెడికల్‌ షాపుల్లో ఫార్మాకోవిజిలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇండియా (పీవీపీఐ) అందించిన ప్రత్యేక క్యూఆర్‌ కోడ్, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–180–3024ను తప్పనిసరిగా ప్రదర్శించాలని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసిమ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు మెడికల్‌ షాపుల నుంచి మందులు వాడిన తర్వాత ఏదైనా దుష్ప్రభావం కనిపించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వడానికి ఈ క్యూఆర్‌ కోడ్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి మెడికల్‌ షాప్‌లో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో క్యూఆర్‌ కోడ్‌ ఉంచాలని, దాన్ని స్కాన్‌ చేసి ప్రజలు నేరుగా అనుమానాస్పద, ప్రతికూల చర్యలను తెలియజేయవచ్చని పేర్కొ న్నారు. ఈ ఫిర్యాదులు నేరుగా పీవీపీఐ ఏర్పాటు చేసిన అడ్వర్స్‌ డ్రగ్‌ రియాక్షన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఏడీఆర్‌ఎంఎస్‌)కు చేరి, దేశవ్యాప్తంగా ఔషధ భద్రత చర్యలకు బలాన్నిస్తాయని వివరించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)