Breaking News

మెడికల్‌ షాపులపై డీసీఏ దాడులు

Published on Thu, 05/30/2024 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఔషధాల ధరలు ఎక్కువ చేసి విక్రయించడం, తప్పుడు లేబుళ్లుతో చేస్తున్న ఉల్లంఘనలపై డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేన్‌ (డీసీఏ) కొరడా ఝుళిపించింది. 

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో యాంటీ ఫంగల్‌ మెడిసిన్‌ ‘టెస్ట్రా–200 క్యాప్సూల్స్‌’ను ఓ మందులషాపులో కేంద్రం నిర్దేశించిన ఎమ్మార్పీపై చాలా అధిక ధరకు విక్రయిస్తుండడంతో మందులు స్వాదీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. 

ఈ మందు పది క్యాప్యూల్స్‌ను రూ.50.30 అధిక ధరకు విక్రయించినట్టు వివరించారు. అత్యవసర మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి మందులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

కళ్ల మందును జ్వరం మందు అంటూ... 
కళ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందును.. జ్వరానికి మందు అంటూ తప్పుడు లేబుల్స్‌తో మార్కెట్‌లో ప్రచారం చేస్తున్న వారిని డీసీఏ గుర్తించిందని కమలాసన్‌రెడ్డి తెలిపారు. పీ–మైసిటిన్‌ అనే ఆయింట్‌మెంట్‌ అల్లోపతి మందును కళ్లవ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుగా, మహసుదర్శన కఢ అనే ఆయుర్వేదిక్‌ మందును జ్వరాన్ని తగ్గించేదిగా తప్పుడు ప్రచారం చేయడంపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని ఓ మెడికల్‌ హాలుపై, ఖమ్మంలో మందుల దుకాణంపై దాడులు చేసి ఆయా మందులు స్వాధీనం చేసుకున్నారు. 

గచ్చిబౌలిలో నకిలీ క్లినిక్‌పై దాడి 
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చి»ౌలిలో ఓ నకిలీవైద్యురాలు కె. స్వరూప తగిన అర్హతలు లేకుండా ‘స్వరూప ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌’పేరిట నిర్వహిస్తున్న క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడిచేసి డ్రగ్‌ లైసెన్స్‌లు లేకుండా ఉన్న 17 రకాల మందులు (యాంటీ బయోటిక్స్‌తో సహా) స్వాదీనం చేసుకున్నారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)