Breaking News

చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...

Published on Mon, 12/15/2025 - 03:21

మహబూబాబాద్‌ రూరల్‌: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. 

గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్‌ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్‌ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. 

పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి. 

గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్‌ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు. 

ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)