Breaking News

రూ.51 కొట్టు.. మేకను పట్టు..!

Published on Sat, 09/28/2024 - 11:36

చిట్యాల, మర్రిగూడ: దసరా పండగ సమీపిస్తుండటంతో గ్రామాల్లో సందండి నెలకొంటోంది. చిట్యాల, మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా యువకులు సరికొత్త స్కీం ప్రారంభించారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో కొందరు యువకులు “51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు’ అని ప్రచారం చేస్తున్నారు. 

ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్‌ తీసుకుంటే.. కూపన్‌ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్‌ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్‌ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్‌నా«థ్‌ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్‌ బీర్లు ఇచ్చేట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.  



ఇక్కడ వంద రూపాయల స్కీం
మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మరో తీరుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి కూపన్‌ తీసుకున్న వారిలో నుంచి డ్రా తీసి మొదటి బహుమతి 10కిలోల మేక, రెండవ బహుమతి రెండు మద్యం బాటిళ్లు(బ్లెండర్‌ స్ప్రైడ్‌), మూడవ బహుమతి కాటన్‌ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక మద్యం బాటిల్‌ అందించనున్నామని, వచ్చే నెల 10న గ్రామంలో డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రచారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)