Breaking News

బస్సెక్కు.. బహుమతి పట్టు

Published on Sat, 09/27/2025 - 12:27

షాద్‌నగర్‌: దసరా సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారా.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా.. అయితే మీరు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని నిర్ణయించింది. 

నేటి నుంచి అక్టోబర్‌ 6 వరకు 
ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్‌ లగర్జీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందించనున్నారు. నిర్ణయించిన బస్సుల్లో ప్రయాణించే వారు బస్సులో తీసుకున్న టికెట్‌ వెనుక పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా రాసి బస్సుల్లో, బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్సుల్లో వేయాలి.   

అక్టోబర్‌ 10న లక్కీ డ్రా 
అధికారులందరి సమక్షంలో అక్టోబర్‌ 10న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. రీజియన్‌ పరిధిలో లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు.  

ప్రత్యేక బస్సులు 
బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు అధికంగా ప్రయాణించే ప్రాంతాలకు అదనపు బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పలు డిపోల్లో అదనపు సరీ్వసులు తిరుగుతున్నాయి.   

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)