రోజూ రూ.కోటి డ్రిప్‌ పరికరాలు

Published on Wed, 12/11/2024 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతులకు రానున్న 90 రోజులపాటు ప్రతీరోజు రూ.కోటి విలువైన డ్రిప్‌ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం రైతుల నుంచి ఈ 90 రోజులపాటు నిత్యం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో–ఆపరేటివ్‌ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని యాసంగి నుంచి అమలుచేసి రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తోపాటు ఉద్యాన పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు 2.31 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌లో తక్కువ పురోగతి ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మార్చికల్లా ముందుగా నిర్దేశించిన లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. 

8.59 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి సేకరణ 
రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు 3,56,633 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 8,59,272.68 మెట్రిక్‌ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 1,99,108.43 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించినట్లు గుర్తుచేశారు. మరో రెండు నెలలపాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

అలాగే, ప్రాథమిక సహకార సంఘాల పనితీరు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకు వాటి సేవలు చేరేలా నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఆ శాఖ డైరెక్టర్‌ గోపి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ ఉదయ్‌కుమార్, హారి్టకల్చర్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)