ఉగ్రవాదులకు నిధులు సమకూర్చావ్‌!

Published on Fri, 02/27/2026 - 03:15

సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను భయభ్రాంతులకు గురి చేసి, అందినకాడికి దోచుకున్నారు సైబర్‌ నేరస్తులు. ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులుగా పేర్కొంటూ 76 ఏళ్ల వృద్ధుడిని నట్టేట ముంచేశారు. ఈమేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధికి చెందిన రిటైర్డ్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌కు జనవరి 17న గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

తాను ముంబై ఏటీఎస్‌ నుంచి పరిచయం చేసుకున్న సైబర్‌ నేరస్తుడు.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినందుకు అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ ఫోన్‌ కాల్‌ ఏటీఎస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న సులేక్‌ కుమార్, ముఖేష్‌ వర్మ, అజయ్‌ కుమార్‌ బన్సాలీలకు బదిలీ అయింది. అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకర్తలతో ముడిపడి ఉన్న బహుళ బ్యాంకు ఖాతాలను తెరవడానికి నా ఆధార్‌ కార్డ్‌ వివరాలను వినియోగించారని తెలిపారు. 

తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి, ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును తొలగించాలంటే బ్యాంక్‌ ఖాతా వివరాలను ధ్రువీకరించాలని సూచించారు. దీంతో నిందితుల సలహా మేరకు బాధితుడు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19 మధ్యకాలంలో నేరస్తులు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు 13 లావాదేవీల్లో రూ.1.44 కోట్లను బదిలీ చేశాడు. ఆ తర్వాత నుంచి నిందితులతో ఫోన్‌ సంభాషణలు, మెసేజ్‌లు లేకపోయేసరికి మోసపోయాననిగ్రహించిన బాధితుడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)