Breaking News

సత్తుపల్లిలో కుబేర మూవీ స్కామ్ రిపీట్

Published on Mon, 01/12/2026 - 14:08

ఖమ్మం జిల్లా: అంతర్జాతీయ స్థాయిలో హవాలా రూపంలో సైబర్‌ ఆర్థిక నేరాలు విస్తరించడంతో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం, హవాలా రూపంలో డబ్బు చేతులు మారడంతో కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, ఐటీలకు సమాచారం అందించనున్నట్లు సీపీ సునీల్‌దత్‌ వెల్లడించడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టినట్టయింది. సైబర్‌ మోసాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాన నిందితులైన పోట్రు మనోజ్‌కల్యాణ్‌, ఉడతనేని వికాస్‌చౌదరి, మోరంపూడి చెన్నకేశవరావు పరారీలో ఉన్నా ఎంతో కాలం తప్పించుకోలేరని పోలీసులు ప్రకటించడంతో కేసులో ఒక్కొక్కరి చిక్కుముడి వీడుతున్నట్టయింది. 

నిందితుల బంధువులు, స్నేహితుల అకౌంట్లను పరిశీలి స్తుంటే బయటపడుతున్న నిజాలు పోలీస్‌ శాఖ ను విస్మయపరిచాయి. రూ.వందల కోట్ల లావా దేవీలు జరగడం, ఇందులో మహిళలను కూడా గుర్తించడం సంచలనంగా మారింది. పోట్రు మనోజ్‌కల్యాణ్‌ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్‌ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహ కృష్ణ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్‌ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్లు.. మొత్తం రూ.547 కోట్ల సైబర్‌ క్రైం లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు.

పోట్రు ప్రవీణ్‌ వ్యవహారంతో..
కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ ముఠా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్‌ చేస్తూ రూ.10కోట్లు కొల్లగొట్టినట్లు గత నవంబర్‌ 29న స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎస్‌ఓటీ) బెంగుళూరు, సైబర్‌క్రైం సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేయడంతో అతి పెద్ద మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌ కేంద్రంగా రిడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరుల బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొట్టి పోట్రు ప్రవీణ్‌తో పాటు పోట్రు ప్రకాష్‌, ఏపూరి గణేష్‌, మోరంపూడి చెన్నకేశవ సైబర్‌ నేరానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.

డిసెంబర్‌ 24న మరో కేసులో..
గతేడాది డిసెంబర్‌ 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్‌ వీఎం బంజరు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు మరో కేసులో ఇంకొందరి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. పోట్రు ప్రవీణ్‌తో పాటు మనోజ్‌కల్యాణ్‌, ఆయన భార్య మేడా భానుప్రియ, మేడా సతీష్‌, ఉడతనేని వికాస్‌, మోరంపూడి చెన్నకేశవరావు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వారికి సహకరించిన జుంజునూరి శివకృష్ణ, వడ్లముడి నరేంద్రకుమార్‌, మల్లాడి శివ, సాధు పవన్‌, సాధు సంధ్య, సాధు శ్రీలేఖతో పాటు బ్యాంక్‌ అకౌంట్లు ఇచ్చి సహకరించిన జొన్నలగడ్డ తిరుమలసాయి, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్‌, గోళ్లముడి నాగముకేష్‌, కంచపోగు శ్రీనివాస్‌, రాయల అజయ్‌కుమార్‌, రాయల గోపి, పాల గణేష్‌, రాయల గోపీచంద్‌, కందుకూరు జగదీష్‌, తాటికొండ రాజు(కరీంనగర్‌)ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు.

పెట్టుబడి ఆశ చూపించి..
సైబర్‌ నేరగాళ్లు అకౌంట్లలోని డబ్బులను కొల్లగొట్టేందుకు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతర్జాతీయ సైబర్‌ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్‌ సెంటర్లు నిర్వహిస్తూ దేశంలోని పౌరులను బురిడీ కొట్టించేందుకు పెట్టుబడి, మ్యాట్రిమొని, రివార్డు పాయింట్లు, గేమింగ్‌, బెట్టింగ్‌, షేర్‌మార్కెట్‌ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ పేరుతో మోసగించి లింకుల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, ఆస్తులను కొనుగోలు చేసిన వారిని గుర్తించి జప్తు చేస్తామని సీపీ వెల్లడించడంతో అక్రమార్కుల్లో టెన్షన్‌ మొదలైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)